మదనపల్లి, ఆగస్టు 22: (gtvmedia)మదనపల్లి బైపాస్ రోడ్డులోని కంపోస్ట్ యార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే యం. షాజహాన్ బాషా పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. స్వచ్ఛతను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రజల నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
