యువతితో చాటింగ్ చేస్తున్నాడని అనుమానం.. బీహార్ యువకుడిపై హత్యాయత్నం

మదనపల్లి, ఆగస్టు 22:( gtvmedia)అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం సీటీఎం సమీపంలో బీహార్‌కు చెందిన యువకుడిపై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. యువతితో చాటింగ్ చేస్తున్నాడన్న అనుమానంతో యువతి బంధువులు అతడిని సుమారు నాలుగు గంటల పాటు విచక్షణారహితంగా కొట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో బీహార్‌కు చెందిన ముఖేష్ కుమార్ మహతి (20) తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలతో ఉన్న అతడిని అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

యువతితో చాటింగ్ చేస్తున్నాడన్న అనుమానంతోనే దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అయితే దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ ఘటనపై మదనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారి వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం పోలీసుల విచారణలో వెలుగులోకి రావాల్సి ఉంది.

GTV | అన్నమయ్య జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *