ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా టీడీపీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
మదనపల్లె: CTM తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో, మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ప్రజాసేవా స్ఫూర్తితో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. MLL హాస్పిటల్ (గోషా హాస్పిటల్) సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
శిబిరంలో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల సలహాలు అందించారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో CTM ఇన్‌చార్జ్ రెడ్డిస్వామి, AMC డైరెక్టర్ చల్లా నరసింహులు, తెలుగు యువత నాయకుడు దేవరింటి సాయికృష్ణ, తెలుగు యువత అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి రాజు, టీడీపీ నాయకుడు కె. నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
