హాస్టల్ భవనానికి మరమ్మతులు చేపడుతాం

మదనపల్లె అక్టోబర్ 7 : మదనపల్లి పట్టణం నీరుగట్టు వారి పల్లి లోని సాంఘిక సంక్షేమ వసతి గృహం లో వర్షం పడితే వస్తున్న విషయమై జీటీవీ మీడియాలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి దామోదరం హాస్టల్ కు వెళ్లి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అద్దె భవనంలో నడుస్తున్న ఈ హాస్టల్కు మరమ్మత్తులు చేపట్టాలని భావన యజమానిని ఆదేశించామన్నారు. ప్రస్తుతం విద్యార్థులు ఉన్నగా మరమ్మతులు చేపట్టడం ఇబ్బందిగా ఉంటుందని, దసరా సెలవుల్లో హాస్టల్ భవనానికి మరమ్మత్తులు చేపడతామని యజమాని చెప్పారన్నారు. విద్యార్థులకు సౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని వార్డెన్ ను ఆదేశించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *