మదనపల్లె, సెప్టెంబర్ 25: స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని గ్రామ, వార్డ్ సచివాలయం ఎంప్లాయిస్ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గుడి నాగరాజు కోరారు. శుక్రవారం సచివాలయం ఉద్యోగులతో కలసి అయన మీడియాతో మాట్లాడుతూ, సచివాలయం ఉద్యోగులకు ప్రధాన సమస్యలైన రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్,ప్రమోషన్ ఛానెల్, స్పష్టమైనా జాబ్ చార్ట్ లను త్వరగా పరిష్కారం చేయాలని కోరారు. సచివాలయం ఉద్యోగుల కు సెలవులు ఇవ్వకుండా వేదిస్తున్న అధికారుల పై చెర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పై అధికారులు కొంతమంది సచివాలయం ఉద్యోగులుకు సమయానికి ఇంక్రిమెంట్స్ మంజూరు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని అలాంటి వారి పై చెర్యలు తీసుకోవాలని కోరారు. కన్ని జిల్లాలో పూర్తి స్థాయి జీతాలు పెట్టకుండా cut చేసి జీతాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే ఉద్యోగుల అంత ఐక్యత చాటుకొని లక్ష మందితో చలో విజయవాడ కార్యక్రమం చేపడతా మని తెలిపారు.
సచివాలయం ఉద్యోగులసమస్యలు పరిష్కరించాలి
