మొక్కలు నాటి పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

కురబలకోట,అక్టోబర్ 6:పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (DWMA) పథక సంచాలకులు వెంకటరత్నం పిలుపునిచ్చారు.

మంగళవారం కురబలకోట మండలంలోని కస్తూరిబా పాఠశాలలో హైడెన్సిటీ ప్లాంటేషన్‌లో భాగంగా నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో PD వెంకటరత్నం పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్ననాటి నుంచే మొక్కల ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాల విద్యార్థులు మొక్కల పెంపకాన్ని ఒక బాధ్యతగా తీసుకుని, పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు.

కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ DD దామోదర్ రెడ్డి, MPDO గంగయ్య, APD చందన, APO సుబ్రహ్మణ్యం, కస్తూరిబా పాఠశాల SO, పాఠశాల కమిటీ చైర్మన్ రెడ్డెప్ప, నాయకులు YG రమణ, పి. సురేంద్ర యాదవ్, VB-GRAMG సిబ్బంది నాగన్న గౌడ్, నాగార్జున, సోమశేఖర్, రమణ, పాఠశాల ఉపాధ్యాయినులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *