ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా సమక్షంలో టీడీపీలో చేరిన షరీఫ్, రాజు శ్యామ్
మదనపల్లె: I అక్టోబర్ 16;మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మదనపల్లెలో రాజకీయ చేరికలు కొనసాగుతున్నాయి. వైసీపీకి చెందిన మాజీ కౌన్సిలర్లు షరీఫ్, క్రిస్టియన్ మైనారిటీ నేత రాజు శ్యామ్ తమ స్నేహితులు, అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా నివాసంలో జరిగిన కార్యక్రమంలో వారు పార్టీ కండువాలు కప్పుకున్నారు.
ఎమ్మెల్యే షాజహాన్ బాషా వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలకు ముందు మాజీ కౌన్సిలర్లు షరీఫ్, రాజు శ్యామ్ టీడీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. వారి సహకారం మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడుతుందని, వారి చేరికతో పార్టీకి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ పరిశీలకులు నెట్టెం వెంకటేష్, కౌన్సిలర్లు బాబు నాయుడు, మార్పురి నాగార్జున బాబు తదితరులు పాల్గొన్నారు.


