మదనపల్లి నియోజకవర్గ ఆలయాల అభివృద్ధికి సహకరించాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వినతి

అమరావతి, ఆగస్టు 19: (gtvmedia)అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాటకొండ మధుబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.

నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, భక్తులకు మెరుగైన సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు, సహకారం అందించాలని రాటకొండ మధుబాబు మంత్రిని కోరారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆలయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

మదనపల్లి నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలనే ఉద్దేశంతో ఈ వినతిపత్రం సమర్పించినట్లు రాటకొండ మధుబాబు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *