మదనపల్లె: పట్టణంలోని సీటీఎం రోడ్డులో గల గరుడా నగర్లో నాగేశ్వర్ నాయుడు గారి ఆహ్వానం మేరకు నిర్వహించిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంగారపు రాందాస్ చౌదరి పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, మదనపల్లె ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ రాయల్, ఏఎంసీ డైరెక్టర్ రోణూరు బాబు, పూల మురళి తదితరులు పాల్గొన్నారు.
