తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ రామ విద్యాసాగర్ మృతి

మంగళవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ రాము విద్యాసాగర్ అనారోగ్య కారణాలతో సోమవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ రామ విద్యాసాగర్ అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు పుంగనూరు రోడ్డులోని కనుమలోగంగమ్మ గుడి సమీపంలోని ఆయన స్వగృహం వద్ద నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆయన మృతి పార్టీ శ్రేణులకు తీరని లోటని పలువురు పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *