“చలో విజయవాడ”కు అనుమతి లేదు.. హాజరైతే చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు
మదనపల్లె, సెప్టెంబర్ 27: అకాల వర్షాలు, వరదల నేపథ్యంలో సెప్టెంబర్ 27న నిర్వహించనున్న “చలో విజయవాడ” కార్యక్రమానికి వెళ్లేందుకు స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి అనుమతి లేదని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ స్పష్టం చేశారు.
అనుమతి లేని సామూహిక కార్యక్రమాలు, ర్యాలీలు, ధర్నాలకు ఉద్యోగులు పూర్తిగా దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి కార్యక్రమానికి హాజరైతే నిబంధనల మేరకు చట్టపరమైన, శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
