రూ.2 కోట్లతో డీపీఆర్‌సీ భవన నిర్మాణం పూర్తి చేస్తాం: ఎమ్మెల్యే షాజహాన్ భాషా

మదనపల్లి, ఆగస్టు 16: (gtvmedia)మదనపల్లి మండలం బసినికొండ గ్రామపంచాయతీలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం (డీపీఆర్‌సీ) భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా భూమిపూజ చేశారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డీపీఆర్‌సీ భవనాన్ని సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు అవసరమైన శిక్షణ, సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు ఈ భవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులతో సమన్వయంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఎమ్ రఫీ,రామ్మూర్తి,గంగారపు నవీన్ చౌదరి,బాలు స్వామి,నంద కుమార్, వైఎస్ మునిరత్నం, రాటకొండ మధు ,ప్రతాప్, జయరాం యాదవ్,వంటికొండ వెంకటేష్, రియాజ్ స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *