మదనపల్లె, ఆగస్టు 14: (gtvmedia)గ్యాస్ వినియోగదారులు తమ LPG e-KYCను పూర్తి చేసుకోవాలని సూచించారు. e-KYCకి ఆగస్టు 16తో గడువు ముగియనున్న నేపథ్యంలో వినియోగదారులు వెంటనే ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంది.
గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే మొబైల్ ద్వారా ఇంటి నుంచే e-KYC పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం సంబంధిత గ్యాస్ కంపెనీ అధికారిక యాప్‌తో పాటు Aadhaar Face RD యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
ఇండేన్ వినియోగదారులు IndianOil ONE, HP Gas వినియోగదారులు HP Pay, భారత్ గ్యాస్ వినియోగదారులు HelloBPCL యాప్‌లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో OTP ద్వారా లాగిన్ కావాలి.
అనంతరం LPG e-KYC/Aadhaar Authentication ఎంపికను ఎంచుకుని ఆధార్ నంబర్ నమోదు చేసి ఫేస్ స్కాన్ పూర్తి చేయాలి. ఫేస్ ఆథెంటికేషన్ విజయవంతమైన తర్వాత e-KYC పూర్తయినట్లు మెసేజ్ లేదా గ్రీన్ టిక్ కనిపిస్తుంది.
గడువు సమీపిస్తున్నందున అర్హత కలిగిన LPG వినియోగదారులు ఆలస్యం చేయకుండా e-KYC ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
