రేపు జూనియర్ ఎన్టీఆర్‌కు భుజానికి శస్త్రచికిత్స

హైదరాబాద్: (gtvmedia)ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో రేపు ఆయనకు సర్జరీ నిర్వహించనున్నట్లు ఆయన కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.

శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకునేందుకు వైద్యులు 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ సమయంలో ఆయన సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండనున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *