ఎర్రకోటపై తొలిసారి ‘వందేమాతరం’.. ఆగస్టు 15న ప్రత్యేక కార్యక్రమం

వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 11: (gtvmedia)స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ఏడాది ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై తొలిసారిగా వందేమాతరం గేయాన్ని ఆలపించనున్నారు. వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వద్దకు చేరుకున్న సందర్భంగా తొలుత ‘వందేమాతరం’ గేయాన్ని ఆలపించనున్నారు. అనంతరం ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత ‘జనగణమన’ జాతీయ గీతాన్ని ఆలపించనున్నట్లు సమాచారం.

స్వాతంత్ర్యోద్యమంలో ప్రజల్లో జాతీయ భావాన్ని, దేశభక్తిని రగిలించిన ‘వందేమాతరం’కు ఈ ఏడాది 150 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’కు ప్రత్యేక స్థానం కల్పించడం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

#VandeMataram #IndependenceDay #August15 #RedFort #PMModi #JanaGanaMana #India #GTVMedia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *