బాధిత విలేకరికి అండగా పోలీసులు..

న్యాయం చేస్తామని సీఐ రవి నాయక్ హామీ
మదనపల్లె, ఆగస్టు 7:(gtvmedia)
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం స్వగృహానికి చేరుకున్న మదనపల్లెకు చెందిన విలేకరి యుగంధర్‌ను మదనపల్లె రూరల్ సీఐ రవినాయక్, ముదివేడు ఎస్‌ఐ మధు రామచంద్రుడు పరామర్శించారు. ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలు కావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించుకున్న యుగంధర్ ఇటీవల ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం టీచర్స్ కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసు అధికారులు బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఐ రవి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాహన యజమానితో మాట్లాడి బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఇన్సూరెన్స్ ద్వారా అందాల్సిన నష్టపరిహారం పొందేందుకు పోలీసు శాఖ నుంచి అవసరమైన అన్ని పత్రాలను త్వరితగతిన అందజేస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి సహకారం అందిస్తామని, చట్టపరంగా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని సీఐ రవి నాయక్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *