మదనపల్లి ఆగస్టు 5 : (gtvmedia)ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ మైదానంలో రెండో రోజు సౌత్ ఇండియా ఫుట్బాల్ పోటీలు పోటాపోటీగా జరిగాయి.
తొలి మ్యాచ్లో స్వామీ ఎఫ్ సీ కాకినాడ జట్టు AFC తురకపల్లి జట్టు పై అద్భుత ప్రదర్శన కనబర్చి విజయం సాధించింది.
రెండవ మ్యాచ్లో ఆడమ్ 11’s(ASC) జట్టు నాయుడుపేట జట్టును ఓడించి తదుపరి దశకు అర్హత సాధించింది.
మూడవ మ్యాచ్లో సిటిజెన్ 11’s జట్టు పర్పుల్ ఎఫ్ సీ జట్టుపై అద్భుత ఆటతీరును ప్రదర్శించి విజయం సాధించింది.
రెండవ రోజు జరిగిన మూడు మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగి క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను పలువురు అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన పోటీలు జరగనున్నందున క్రీడాభిమానులు అధిక సంఖ్యలో హాజరై ఆటగాళ్లను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు.
