రెడ్డెప్ప నాయుడు కాలనీ సమస్యలు పరిష్కరిస్తాం

మదనపల్లి, ఆగస్టు 4:( gtvmedia)మదనపల్లి పట్టణం కాలనీ సమస్యలు పరిష్కరిస్తామని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రెడ్డి కాలనీలో సమావేశమైన రాటకొండ రెడ్డెప్ప నాయుడు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ వాసుదేవ నాయుడు ట్రెజరర్ సుబ్రహ్మణ్యం పాల్గొని కాలనీ సమస్యలపై మరియు అభివృద్ధి కార్యక్రమాలు గురించి కమిటీ సభ్యులతో ప్రజలతో చర్చించారు.. పార్క్ లో వీధిదీపాలు, వాకర్స్ కోసం బెంచ్ లు ఏర్పాటు చేసమన్నారు..ఈ సందర్భంగా వాకర్స్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి సాయంత్రం, వేకువ జామున వాకింగ్ చేసే వారికి వెలుతురు లేక ఇబ్బంది పడుతున్నామని ఇన్నిరోజులకు అసోసియేషన్ వారి సహకారం తో సమస్య పరిష్కారం అయ్యిందని తెలిపారు.. అలాగే 2 టౌన్ CI మొహమ్మద్ రఫీ, SI బొమ్మినేని రామాంజులు మాట్లాడుతూ ప్రతి ఇంటి ముందు తప్పకుండా CC కెమెరా ఏర్పాటు చేసుకోవాలని దొంగతనాలు జరిగిన తరువాత బాధ పడకుండా ముందుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు… ఈ మీటింగ్ లో పలువురు డాక్టర్స్, కాలనీ ప్రముఖులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *