మదనపల్లె: మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం “జిమాక్స్–2కె26 (2.0)” నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అమెజాన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, మిట్స్ పూర్వ విద్యార్థి టి.ఆర్. దీక్ష, కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ హర్షితా రెడ్డి ముడివేటి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా దీక్ష మాట్లాడుతూ విద్యార్థులు డిగ్రీతో పాటు సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ సామర్థ్యం, ఆచరణాత్మక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, డీన్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీదేవి, కోఆర్డినేటర్లు డాక్టర్ జి. శ్రీనివాసులు, డాక్టర్ పి. కవిత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


