మదనపల్లె, అక్టోబర్ 19: మదనపల్లె రూరల్ మండలం వేంపల్లి గ్రామంలోని హరిజనవాడకు చెందిన నల్లప్ప మనవడు, 10 ఏళ్ల చిన్నారి వినయ్ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మరో రూ.3 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది.
లివర్ ఇన్ఫెక్షన్తో తీవ్ర అనారోగ్యానికి గురైన వినయ్‌కు చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. చిన్నారి చికిత్స కోసం మూడు నెలల క్రితం సీఎంఆర్ఎఫ్ ద్వారా తొలివిడతలో రూ.8 లక్షల ఆర్థిక సహాయం అందింది. తాజాగా రెండో బిల్లు ద్వారా మరో రూ.3 లక్షలు మంజూరయ్యాయి.
ఈ నేపథ్యంలో మదనపల్లె ఎమ్మెల్యే శ్రీ ఎం. షాజహాన్ భాషా నివాసంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా చిన్నారి వినయ్ కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.
తాజాగా మంజూరైన రూ.3 లక్షలతో కలిపి చిన్నారి వైద్య చికిత్స కోసం ఇప్పటివరకు మొత్తం రూ.11 లక్షల సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం అందినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి.

