మదనపల్లె: మదనపల్లె మండలం బొమ్మన చెరువు పంచాయతీలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా భూమి పూజ నిర్వహించారు. స్థానిక నాయకులు, సంబంధిత అధికారులతో కలిసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
నూతన సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయితే పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపడేందుకు, విద్యుత్ అవసరాలను తీర్చేందుకు దోహదపడనుంది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

