మదనపల్లె, అక్టోబర్ 10:
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబరు 10న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ గీతా పేర్కొన్నారు. శనివారం నవోదయ విద్యాలయాలో
558 మంది విద్యార్థుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో
ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో నిత్యజీవితంలో మానసిక ఒత్తిడి ప్రతి వ్యక్తిలో తీవ్ర రూపం దాలుస్తూ ఉందన్నారు., కాలంతో పోటీ పడే నేటి ఆధునికకాలంలో పోటీ ప్రపంచంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ప్రతి వ్యక్తికి తక్షణ కర్తవ్యం అని దానికోసం యోగా మెడిటేషన్ వంటి ప్రక్రియలు నిరంతరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆకాంక్షించారు.
విద్యాలయ కౌన్సిలర్ డి.శంకరప్ప ఈ సంవత్సరం ప్రభుత్వం వారు ఇచ్చిన థీమ్ నిజమైన జీవిత అనుభవాలు – నిజమైన మార్పులు ( real voice real changes) అవసరమని, సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలు మన నిత్యజీవితంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో ప్రయోగాత్మకంగా విద్యార్థులకు నిరూపించి చూపించారు. విద్యాలయ యోగా టీచర్ సందీప్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్ టి.అరుణ కుమారి ముఖ్యఅతిథిగా పాల్గొని మానసిక ఆరోగ్య ఆవశ్యకతను, జీవితంలో ప్రధాన భూమిక పోషించే మెడిటేషన్, మేధా యోగ యొక్క ప్రాముఖ్యతలను విద్యార్థులకు వివరించి మెడిటేషన్ చేయించారు కౌన్సిలర్ రేష్మ భాను ,సీనియర్ టీచర్ శ్రీ జగదీష్ కుమార్ తదితర అధ్యాపకులందరూ పాల్గొన్నారు.
నవోదయలో ఘనంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
