మహిళపైకి ట్రాక్టర్ ఎక్కించిన నిందితుడికి 5 ఏళ్ల జైలు, రూ.20 వేల జరిమానా

మదనపల్లె, అక్టోబర్ 08: దారి, ఇంటి స్థలం వివాదంలో కక్ష పెంచుకుని, సాటి మనిషి అని కూడా చూడకుండా ఓ మహిళను ట్రాక్టర్ తో తొక్కిస్తూ దారుణంగా హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి గ మదనపల్లె 7వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 20,000/- జరిమానా విధిస్తూ గురువారం న్యాయఅధికారి ఆర్. శ్రీలత తీర్పునిచ్చారు.
చౌడేపల్లి మండలం, దిగువపల్లె పంచాయతీ కొలింపల్లె గ్రామానికి చెందిన పాశం నాగరాజ (45) కు, అదే గ్రామానికి చెందిన ఫిర్యాదుదారులకు మధ్య ఇంటి స్థలం, రహదారికి సంబంధించి గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో 07.09.2023 న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో.. అడ్డువచ్చిన ఫిర్యాదుదారుడి భార్య యనమల సావిత్రమ్మను అంతమొందించాలనే దురుద్దేశంతో నిందితుడు నాగరాజ తన ట్రాక్టర్తో ఆమెపైకి వేగంగా దూసుకెళ్లాడు. ఈ దారుణ ఘటనలో ట్రాక్టర్ ఆమె ఎడమ కాలు, ఛాతి భాగం పైనుంచి వెళ్లడంతో పలు ఎముకలు విరిగిపోయాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు మదనపల్లె జిల్లా ప్రభుత్వకి తరలించగా పరిస్థితి విషమించడంతోమెరుగైన వైద్యం కోసం తిరుపతి SVRR ఆసుపత్రికి రిఫర్ చేశారు. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాపాయం నుండి బయటపడింది.

అప్పటి చౌడేపల్లి ఎస్ఐ జి. రవికుమార్ ఈ ఘటనపై కేసు నమోదు చేసి పక్కాగా దర్యాప్తు చేశారు. సాక్షులను విచారించి, మెడికల్ సర్టిఫికెట్లు, నేరానికి వాడిన వాహనాలను సీజ్ చేసి కోర్టుకు బలమైన ఆధారాలు సమర్పించారు. ‘పోలీస్ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్’ ద్వారా ఈ కేసును అన్నమయ్య జిల్లా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె. గణపతి గారు బాధితుల తరపున బలంగా వాదనలు వినిపించడంతో నేరం రుజువైంది.
నిందితుడు పాశం నాగరాజను దోషిగా నిర్ధారించిన న్యాయమూర్తి.. శిక్ష ఖరారు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *