మదనపల్లె, అక్టోబర్ 6:
మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఎమ్మెల్యే షాజహాన్ భాషా చర్చించారు.
విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే షాజహాన్ భాషా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు తదితర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మదనపల్లి ప్రాంతంలో సాగు, తాగునీటి అవసరాలు, రహదారుల అభివృద్ధి, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే వివరించినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరినట్లు పేర్కొన్నారు.
మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రితో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగినట్లు ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.

