మదనపల్లెకు సీఎం చంద్రబాబు.. ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్

మదనపల్లె, అక్టోబర్ 3: మదనపల్లె అభివృద్ధికి బాటలు వేయడంతో పాటు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు మదనపల్లెకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఘన స్వాగతం పలికారు.

గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మదనపల్లెకు వచ్చిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆయనను కలిసి ఆత్మీయంగా స్వాగతం పలికారు.

మదనపల్లె ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి పర్యటనతో మదనపల్లె అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని టీడీపీ శ్రేణులు పేర్కొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *