మదనపల్లి, సెప్టెంబర్ 28 :
పిజిఆర్ఎస్ సమస్యలను జాప్యం లేకుండా నాణ్యత ప్రామాణికంగా అర్జీదారుడు సంతృప్తి చెందేలా త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలు నందు… ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తోపాటు డిఆర్ఓ వెంకటేష్, రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, కెఆర్ఆర్సి ఎస్డిసి చంద్రశేఖర్ రెడ్డి, హెచ్ ఎన్ ఎస్ ఎస్డిసి మాధవ కృష్ణారెడ్డి,సర్వే శాఖ ఏడి శాంతరాజ్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ…. పిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు, బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారులనుండి వారు అర్జీలను స్వీకరించారు.
