పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 91 ఫిర్యాదులుమదనపల్లె, సెప్టెంబర్ 21:

మదనపల్లెలో సోమవారం జరిగిన పోలీసు pgrs కార్యక్రమంలో 91మంది ఫిర్యాదులు అందజేశారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో
మొత్తం 91 పిటిషన్లలో భూ వివాదాలు 40, ఆర్థిక వివాదాలు 20, కుటుంబ వివాదాలు 9, న్యూసెన్స్ 10, పరిపాలనా సంబంధిత అంశాలు 7, సైబర్ 1,ఇతరాలు 4 ఉన్నాయి.
బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన అదనపు ఎస్పీ, ఇక్కడికి రాలేని వారు స్థానిక పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *