చేనేత కార్మికులకు న్యాయం చేయాలి

మదనపల్లె సెప్టెంబర్ 21:
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇస్తున్న నేతన్న సేవ పథకంలో అవకతవకలు జరిగాయని,వీటి పైన విచారణ జరిపించి అర్హులైన చేనేత కార్మికులందరికీ న్యాయం చేయాలని
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి ఆరోపించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేనేత కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. మురళి మాట్లాడుతూ నేతన్న సేవ పథకంలో అవకతవకలు జరిగాయని నిజమైన అర్హులను జాబితా నుంచి తొలగించి,అనర్హులను జాబితాలో చేర్చి వారి దగ్గర వేల రూపాయలు లంచాలు తీసుకున్నారని ఆగస్టు ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేనేత కార్మికులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అందులో భాగంగానే మదనపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు కూడా వందలాది మంది లబ్ధిదారులు ఆందోళన నిర్వహిస్తే, స్పందించిన అధికారులు ఈ అక్రమాలపైన విచారణ జరిపించి అర్హులకు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, దీనిపై విచారణ జరిగినప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాధవ్ కుమార్,తిరుమలప్ప,విజయన్ చేనేత కార్మికులు కిరణ్, వెంకటరెడ్డి, బయ్యారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *