మదనపల్లె, సెప్టెంబర్ 16: ప్రజలకు, రాజకీయ పార్టీలకు ముందస్తు సమాచారం లేకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని వైసీపీ నాయకులు ఎంపిడివో ను ప్రశ్నించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయం లో వైసీపీ నాయకులు కలసి వినతి పత్రం అందజేశారు.
మదనపల్లె మండలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పునర్విభజన ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వి.ఎస్. రెడ్డి, మండల కన్వీనర్ దండు కరుణాకర్ రెడ్డి, వెలుగు చంద్ర, పోతబోలు నాగరాజు, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, అంకిశెట్టిపల్లి రమణ, బొమ్మనచెరువు రమణ తదితరులు హాజరయ్యారు.
రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని కోరారు.
పోలింగ్ కేంద్రాల ఎంపికలో ప్రజలకు సౌకర్యం, గ్రామాల మధ్య దూరం, ఓటర్ల సంఖ్య, రవాణా సౌకర్యాలు, వృద్ధులు మరియు దివ్యాంగ ఓటర్లకు అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరారు. ఎలాంటి అభ్యంతరాలకు అవకాశం లేకుండా పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రక్రియను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
