నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు పరీక్ష

మదనపల్లె, సెప్టెంబర్ 08:
అన్నమయ్య జిల్లా వలసపల్లిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 9వ తరగతి, 11వ తరగతిలో ఖాళీ సీట్ల భర్తీ కోసం లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ (LEST–2027) నిర్వహించనున్నట్లు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ ఎం. గీత మంగళవారం తెలిపారు.
దీనికోసం ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబర్ 30, 2026 అని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

9వ తరగతి ప్రవేశాలకు:
https://cbseitms.nic.in/2026/nvsix_9/

11వ తరగతి ప్రవేశాలకు:
https://cbseitms.nic.in/2026/nvsxi_11/

లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం. గీత తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *