పోలీసుల కస్టడీ నుంచి జైలుకు కిడ్నీ రాకెట్ నిందితులు

మదనపల్లె, సెప్టెంబర్ 8: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో నిందితులు తిరిగి జైలుకు తరలివెళ్లారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్ పార్థసారథి, పిల్లి పద్మ, కాకర్ల సత్యనోలను టూ టౌన్ పోలీసులు సోమవారం సబ్‌జైలు నుంచి పోలీసు కస్టడీలోకి తీసుకుని పలు అంశాలపై విచారించారు.

కస్టడీ గడువు ముగియడంతో ముగ్గురినీ తిరిగి జైలుకు తరలించే ముందు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్య పరీక్షలు పూర్తయ్యాక టూ టౌన్ పోలీసులు ముగ్గురినీ స్థానిక సబ్‌జైలుకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *