కొత్తవారిపల్లె మాజీ సర్పంచ్ మృతి

మదనపల్లె, సెప్టెంబర్ 8: మదనపల్లి మండలం కొత్త వారి పల్లి మాజీ సర్పంచ్ గౌని వెంకటరమణ మృతికి వైఎస్సార్‌సీపీ నాయకులు నివాళులు అర్పించారు.

మదనపల్లె మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ మాజీ సర్పంచ్, సీనియర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌని వెంకటరమణ గత కొన్ని నెలలుగా అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం అయన నివాసంలోనే మృతి చెందారు. వైఎస్సార్ సిపి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిసార్ అహ్మద్, మాజీ శాసన సభ్యులు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ శాసన మండలి సభ్యులు బి. నరేశ్ కుమార్ రెడ్డి తదితరులు వెళ్లి వెంకటరమణ గారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *