మదనపల్లి, సెప్టెంబర్ 07: సీఎం కార్యాలయ సూపర్ ఆడిట్ టీం ద్వారా జిల్లాకు పంపిన పిటిషన్లపై జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ సోమవారం మదనపల్లి కలెక్టరేట్లో విచారణ నిర్వహించారు. మొత్తం 14 పిటిషన్లను సంబంధిత అధికారులు, అర్జీదారులతో కలిసి పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించారు.

అధికారుల స్థాయిలో లోపాలు లేదా పొరపాట్లు గుర్తిస్తే తక్షణమే సరిదిద్ది అర్జీదారులకు న్యాయం చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం తీసుకున్న నిర్ణయాలు సరైనవిగా ఉంటే వాటిని అర్జీదారులకు స్పష్టంగా వివరించి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.
ప్రజల ఫిర్యాదులను బాధ్యతతో పరిశీలించి, నిబంధనల పరిధిలో సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో జిల్లా పీజీఆర్ఎస్ నోడల్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, పీజీఆర్ఎస్ సిబ్బంది, సంబంధిత అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.
