మదనపల్లె: సెప్టెంబర్ 7:పట్టణంలోని దిలీప్ ప్యారడైజ్ సోదరుడు, దివంగత భండారి ధుంగాల్ చంద్ 4వ వర్ధంతి సందర్భంగా ఉషా థియేటర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
చిత్తూరు బస్టాండు సమీపంలోని ఉషా థియేటర్ ప్రాంగణంలో సోమవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ పాల్గొని దివంగత భండారి ధుంగాల్ చంద్‌కు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు, అభిమానులు నివాళులు అర్పించారు. ఉషా థియేటర్ మిత్ర బృందం సభ్యులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
