మదనపల్లె, సెప్టెంబర్ 6: మాలేపాడు గ్రామంలో చెట్లు నాటి పవనన్న పచ్చని బాట” కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏపీఐఐసి డైరెక్టర్ మైఫోర్స్ మహేష్.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 51 శాతం గ్రీన్ కవర్ 2047 లోపు సాధించాలని ఆశయంతో పనిచేస్తున్న తరుణంలో… తమ వంతు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా పవనన్న పచ్చని బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం మదనపల్లె మండలం మాలేపాడు గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మూడు నెలలపాటు మదనపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, మైఫోర్స్ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్థామన్నారు. మదనపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఈ మూడు నెలల్లో 2029 చెట్లు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను స్థానిక నాయకులకి అప్పగించి నాటిన ప్రతి చెట్టు సంరక్షించబడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాలేపాడు గ్రామం ప్రజలు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ జనసేన పార్టీ సీనియర్ నాయకులు సద్దికూటి హరినాథ్, మై ఫోర్స్ అధ్యక్షుడు ఉమేష్, మై ఫోర్ సుమన్ సింగ్ అధ్యక్షురాలు పసినికొండ శోభారాణి, మైఫోర్స్ డైరెక్టర్ సునీత, జనసేన సీనియర్ నాయకురాలు జయ భవ్య, సింధు,మౌనిక జనసేన పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి ప్రసాద్, రమణ మాలేపాడు జనసేన నాయకుడు సురేష్ సాంబశివ రమణ తదితరులు పాల్గొన్నారు
పావనన్న పచ్చని బాటకు విశేష స్పందన
