పి.జి.ఆర్.ఎస్ ను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లి, సెప్టెంబరు-6:

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)ను ఈనెల 7న సోమవారం ఉదయం 10.00 గంటల నుండి జిల్లా, మండల స్థాయిలో అన్ని కార్యాలయాల్లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పి.జి.ఆర్.ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేసి ఆర్జీల వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. మీ కోసం వెబ్ సైట్ లో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చని అన్నారు. ప్రజలు నేరుగా సోమవారం నిర్వహిస్తున్న పి.జి.ఆర్.ఎస్ లో అర్జీలు సమర్పించవచ్చని లేదా మీ కోసం వెబ్ సైట్   
Meekosam.ap.gov.in
(మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) లో కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పి.జి.ఆర్.ఎస్ కు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1100 ను వినియోగించుకొని, ఆర్జీల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని సూచించారు. అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా స్పందన తెలియజేయవచ్చని చెప్పారు.

అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాగలరని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *