ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

హర్షం వ్యక్తం చేసిన ఏపీ జేఏసీ నేతల

మదనపల్లె, సెప్టెంబర్ 6: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న కీలక నిర్ణయాల పట్ల ఏపీ జేఏసీ మదనపల్లె తాలూకా, అన్నమయ్య జిల్లా నాయకులు హర్షం, సంతృప్తి వ్యక్తం చేశారు.

మదనపల్లె పట్టణంలోని ఏపీ ఎన్జీవోస్ కార్యాలయం వద్ద ఏపీ జేఏసీ నాయకులు సమావేశమై, ముఖ్యమంత్రి ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ఈ సందర్భంగా ఏపీ జేఏసీ నాయకులు రెడ్డిశేఖర్, పోకల మధుసూదన్ మరియు శివప్రసాద్ తెలిపారు.

ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిగణించి, అనుకూల నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు రాష్ట్ర ఏపీ జేఏసీ నాయకులైన విద్యాసాగర్, డి.వి. రమణ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బాణాసంచా కాల్చి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *