రాయచోటిలో మంత్రులతో తంబళ్లపల్లి ఇన్‌చార్జ్ జి. శంకర్ భేటీ

రాయచోటి, సెప్టెంబర్ 5: తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ జి. శంకర్ యాదవ్ శనివారం రాయచోటిలో రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి, అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, రవాణా, క్రీడా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, జోన్-4 కోఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్యలను జి. శంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రులతో సౌహార్దపూర్వకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. తంబళ్లపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి భవిష్యత్‌లో సమన్వయంతో ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *