ఆర్మీ అటాచ్మెంట్ క్యాంప్‌లో మిట్స్ ఎన్‌సీసీ క్యాడెట్ల ప్రతిభ

మదనపల్లి: సెప్టెంబర్ 4 :మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు సికింద్రాబాద్‌లోని 20 మద్రాస్ రెజిమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్మీ అటాచ్మెంట్ క్యాంప్‌లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. ఈ క్యాంప్‌లో క్యాడెట్లు ఎ. మహియా, కె. రంజిత మరియు బి. శ్యామల వివిధ సైనిక శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్యాంప్‌లో భాగంగా క్యాడెట్లు భారత సైన్యంలో జీవన విధానం, క్రమశిక్షణ, శిక్షణా పద్ధతులు, విధి నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యక్ష అవగాహన పొందడంతో పాటు తమ ప్రతిభ, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. భారత సైన్యంలో వినియోగించే ఏకే-47, రాకెట్ లాంచర్, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్‌సాస్, ఎల్‌ఎంజీ వంటి వివిధ ఆయుధాలపై అవగాహన పొందారు. ఆధునిక డ్రోన్ సాంకేతికత, సైనిక కార్యకలాపాల్లో డ్రోన్ల వినియోగం, ఆధునిక యుద్ధరంగంలో వాటి ప్రాధాన్యత గురించి క్యాడెట్లు తెలుసుకున్నారు. క్యాంప్‌లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి సాధించడం మిట్స్ ఎన్‌సీసీ క్యాడెట్ల ప్రతిభకు, క్రమశిక్షణకు, అంకితభావానికి నిదర్శనమని తెలిపారు.ఆర్మీ అటాచ్మెంట్ క్యాంప్‌లో ప్రతిభ కనబరిచిన క్యాడెట్లను మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ ఎన్. ద్వారకానాథ్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందించారు. క్యాడెట్లకు నిరంతరం ప్రోత్సాహం, మార్గదర్శకత్వం, సహకారం అందించిన చిత్తూర్ 35 (A) ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ విభాగం మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి. లోకనాథన్ లకు మిట్స్ యాజమాన్యం మరియు ఎన్‌సీసీ ఏఎన్‌ఓ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్ లు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *