బహుజన యువసేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు

మదనపల్లె, సెప్టెంబర్ 1:
బహుజన యువసేన ఆధ్వర్యంలో మదనపల్లె నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు పునీత్ కుమార్ తెలిపారు.

బుధవారం వివోఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీ నుంచి నియోజకవర్గంలోని పలుచోట్ల ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శిబిరాల్లో మానసిక వైద్య నిపుణులు, జనరల్ సర్జన్‌ల ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు, అవసరమైన సలహాలు అందించనున్నట్లు తెలిపారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉచిత వైద్య సేవలు పొందాలని పునీత్ కుమార్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *