మదనపల్లి, సెప్టెంబర్ 2:
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని మదనపల్లి పట్టణంలో జనసేన శ్రేణులు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
మదనపల్లి పట్టణంలోని నాగిరెడ్డిగారి వీధి, కురువంక ప్రాంతాల్లో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో గౌరవ ఎమ్మెల్యే యం. షాజహాన్ బాషా , జునైద్ అక్బరి తో కలిసి స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలతో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
