బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

మదనపల్లె, సెప్టెంబర్ 2: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 3న నిర్వహించనున్న ఈ వేడుకల్లో చిన్నారులు, విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బ్రహ్మకుమారి పద్మావతి మాట్లాడుతూ.. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణుడి ప్రసాదాల పంపిణీతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేయనున్నట్లు బ్రహ్మకుమారి పద్మావతి తెలిపారు. ఆధ్యాత్మికతతో పాటు చిన్నారులు, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మదనపల్లె ప్రజలు, చిన్నారులు, విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సెప్టెంబర్ 3న జరగనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరి పాల్గొననున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *