మదనపల్లె, jul28 (gtvmedia): కొత్తపల్లి-3 పంచాయతీ పరిధిలోని కొత్తఇండ్ల గ్రామంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రూ.50 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఈ మేరకు నేడు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ఈ పనులను ఎంపీడీవో తాజ్ మన్‌సూర్, పంచాయతీ రాజ్ ఏఈ రమణ పర్యవేక్షించారు. గ్రామంలో రోడ్ల సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కొత్తఇండ్ల గ్రామస్థులు మదనపల్లె ఎమ్మెల్యే శ్రీ ఎం. షాజహాన్ బాషా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమస్యను పరిష్కరించే దిశగా సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తఇండ్ల పంచాయతీ టీడీపీ నాయకులు తాళ్ళ గిరి, సహదేవ, పతి, దొరస్వామి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
