తంబళ్లపల్లి, ఆగస్టు 26: (gtvmedia)తంబళ్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా జి. శంకర్ యాదవ్ నియమితులయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శంకర్ యాదవ్‌ను నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం వంటి బాధ్యతలను శంకర్ యాదవ్ నిర్వహించనున్నారు.
శంకర్ యాదవ్ నియామకంతో తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.
