మదనపల్లెలో ఘనంగా రజకుల రౌండ్ టేబుల్ సమావేశం

మదనపల్లె టౌన్ Gtv ప్రతినిధి  : రజకుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధన కోసం మదనపల్లెలో రజకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రజక సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

సమావేశంలో రజకుల సామాజిక, ఆర్థిక సమస్యలతో పాటు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హక్కులు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. రజకుల అభివృద్ధికి ప్రభుత్వం మరింత సహకారం అందించాలని సమావేశంలో పలువురు నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో మదనపల్లె శాసనసభ్యులు శ్రీ ఎం. షాజహాన్ బాషా గారు పాల్గొని రజక సంఘాల ప్రతినిధులతో సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రజకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.
సమావేశంలో పలువురు రజక సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం అనంతరం రజకుల సమస్యలపై ప్రభుత్వానికి వినతులు అందజేసి, పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *