శ్రీరామ్ చినబాబును కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం
మదనపల్లె, ఆగస్టు 21: (gtvmedia)మదనపల్లి–పుంగనూరు మార్గంలోని కనుమలో గంగమ్మ ఆలయ చైర్మన్గా ఎంపికైన గుట్ట వెంకటరమణ, శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ.. గంగమ్మ ఆలయ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న గుట్ట వెంకటరమణకు అభినందనలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు.
గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని, భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ఆలయ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని శ్రీరామ్ చినబాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తెలుగు యువత నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
