కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసిన హీరో సాయి ధరమ్ తేజ్

కొత్త సినిమా “సంబరాల ఏటిగట్టు” విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు

చిత్తూరు జిల్లా, పూతలపట్టు: (gtvmedia)ప్రముఖ సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. తన కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు విజయవంతం కావాలని కోరుతూ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న హీరోకు దేవస్థానం అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అలాగే తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.

ఆలయ పరిసరాల్లో ప్రత్యేక సందడి

దర్శనం అనంతరం ఆలయ పరిసరాల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో చేరి సాయి ధరమ్ తేజ్‌ను కలుసుకున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ వాతావరణం సినీ అభిమానులతో సందడిగా మారింది.

చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

కాణిపాకం ఆలయ పరిధిలోని చైర్మన్ గెస్ట్ హౌస్ వద్ద సాయి ధరమ్ తేజ్ తన మామయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిన్న కేక్ కట్ చేశారు. రెండు మూడు రోజుల్లో చిరంజీవి బర్త్‌డే ఉండటంతో ముందుగానే ఈ వేడుక నిర్వహించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా అక్కడ ఉన్న అభిమానులు కూడా వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

భక్తి, సినీ సందడి కలయిక

కాణిపాకం ఆలయ పరిసరాల్లో ఒకవైపు భక్తి వాతావరణం, మరోవైపు సినీ సందడి కనిపించింది. సాయి ధరమ్ తేజ్ దర్శనం సందర్భంగా ఆలయ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *