నేతన్నల సేవలో పధకంలో అర్హులైన వారికి అన్యాయం — అవినీతిపై సమగ్ర విచారణ జరిపించండి

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్‌. రెడ్డీ సాహెబ్ డిమాండ్

జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్‌కు వినతిపత్రం

మదనపల్లె ఆగస్టు 12:( gtvmedia)కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్నల సేవలో పథకం ఉద్దేశం మంచిదైనా, అర్హులైన వారికి అందకపోగా, అవినీతి రాజ్యామేలుతోందని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్‌. రెడ్డీ సాహెబ్ ఆరోపించారు. అన్నమయ్య జిల్లాలో అర్హులైన వారికి అందలేదని, అన్ని అర్హతలు వున్నవారికి న్యాయం చేయాలని కోరుతూ అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో ఇన్‌చార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మకు ఎస్.రెడ్డీ సాహెబ్ ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేసినారు. ఈ సందర్భంగా ఎస్.రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ టీడీపీ నాయకుల కనుసన్నలలోనే అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక జరిగిందని, అసలైన లబ్ధిదారులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పధకం ప్రకటించడం కాదు, ఆ పథకం ఫలితం నిజమైన నేతన్న ఇంటికి చేరాలని అన్నారు. అన్నమయ్య జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన లబ్ధిదారులకు పధకం చేరలేదని అన్నారు.20 నుంచి 30 శాతం మాత్రమే నిజమైన లబ్ధిదారులు ఉంటారు. ‌మిగిలిన వారు దొంగ అడ్రసు, తప్పుడు సమాచారం ఇచ్చిన లబ్ధిదారులు అయ్యారని ఆరోపించారు. దీంతో నిజమైన వారికి పధకం అందలేదు. ‌దీనిని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఒక్క అర్హుడైన నేతన్నకు కూడా అన్యాయం జరిగితే బాధితుల తరఫున పోరాటం చేస్తామని, అవసరమైతే జిల్లా వ్యాప్తంగా నేతన్నలకు మద్దతుగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ కౌన్సిలర్ మీనా కుమారి, అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శరత్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు ఈశ్వరయ్య, మదనపల్లె టౌన్ మైనారిటీ అధ్యక్షులు మహబూబ్ పీర్, రూరల్ మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ అలీ, సోమశేఖర్, నాగరాజు, రవీంద్ర, జీవన్ కుమార్, జగదీష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *