12, 13 వార్డుల్లో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం – ప్రజలకు ప్రభుత్వ విజయాల వివరణ
మదనపల్లె, ఆగస్టు 7 (GTV MEDIA): మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12, 13 వార్డుల్లో గురువారం నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా స్థానిక కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించి, సమాచార కరపత్రాలను పంపిణీ చేశారు.
ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం లభిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి మైనార్టీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మైనార్టీ ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా స్థానిక నాయకులు నిరంతరం ప్రజలతో అనుసంధానంగా పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో SA మస్తాన్, N విద్యసాగర్,గంగారపు నవీన్,గిరీష్,రాయల్ సీనా,మహేష్ ,స్థానిక కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
