మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు “సాంకేతికత–వ్యాపార రంగాల సమన్వయంతో సమర్థవంతమైన పరిష్కారాలు” అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరులోని మెడిబడ్డీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో టెక్నికల్ ప్రోగ్రామ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్న మిట్స్ పూర్వ విద్యార్థిని హజీనాబి డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతికతలు వ్యాపార రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యాపార అవసరాలకు అనుగుణంగా అనుసంధానం చేయడం ద్వారా సంస్థల పనితీరు, సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయవచ్చని అన్నారు. సాఫ్ట్వేర్ అభివృద్ధిలో అజైల్ మెథడాలజీస్, డెవ్ఆప్స్, ఏపీఐ ఇంటిగ్రేషన్, డేటా ఆధారిత నిర్ణయాలు వంటి ఆధునిక విధానాలు సమర్థవంతమైన సాంకేతిక పరిష్కారాల రూపకల్పనలో కీలకమని అన్నారు. క్రాస్-ఫంక్షనల్ టీమ్‌వర్క్, డిజిటల్ కమ్యూనికేషన్, నాలెడ్జ్ షేరింగ్, మానవ సంబంధాల సమన్వయం ద్వారా సాంకేతిక పరిష్కారాలను వాస్తవ వ్యాపార అవసరాలకు అనుగుణంగా రూపొందించవచ్చని తన వృత్తిపరమైన అనుభవాల ఆధారంగా తెలియజేశారు. ప్రస్తుతం పరిశ్రమల్లో ఏఐ ఇంజినీర్, డేటా అనలిస్ట్, క్లౌడ్ ఇంజినీర్, సాఫ్ట్వేర్ డెవలపర్, బిజినెస్ అనలిస్ట్, డెవ్ఆప్స్ ఇంజినీర్ వంటి ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తున్నాయని అన్నారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విశ్లేషణాత్మక ఆలోచనా విధానం, సమస్య పరిష్కార సామర్థ్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, బృందంగా పనిచేసే లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పన మాట్లాడుతూ, విద్యాసంస్థల్లో పొందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశ్రమల అవసరాలకు అనుసంధానించడంలో పూర్వ విద్యార్థుల అనుభవాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు . తద్వారా అకాడమిక్ విద్యకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంతో పాటు, విద్యార్థులు భవిష్యత్తులో నైపుణ్యవంతమైన సాంకేతిక నిపుణులుగా ఎదగడానికి ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఆర్.కల్పన, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగ శ్వేత, అల్యూమిని కోఆర్డినేటర్ ఎస్తర్ మెర్లిన్, కో-కోఆర్డినేటర్ డాక్టర్ కె.చొక్కనాథన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



